5 June 2021

వంతెన

కాశీ విశ్వేశ్వరుని ముంగిట హాహాకారపు గంటలు
గంగా నదీ తీరాన ఏవో గుర్తు తెలియని మంటలు.

గ్రీష్మపు ప్రభాత సూర్యుడి భస్మాకారపు చీకటి,
కబేళ ప్రవాహ నిర్ఝరీలో పావనమైనదా ఈ తటి?

అన్నీ కర్మలలోకెల్లా ఏది ఎక్కువ హీనం?
బుక్సార్ వంతెన పైనుండి పడతోసి విలీనం.

ఏమని చెప్పను ఈ పుణ్యభూమిని గూర్చి?
ఏ రాచగృహం కట్టను ఈ శవాలను చేర్చి?