ధ్రువ తారకు బిడ్డ నేను, ఎన్నటికి మారబోను,
అవిటి వాడ్ని కాను నేను, నాట్యములో మునిగినాను,
అవిటి వాడ్ని కాను నేను, నాట్యములో మునిగినాను,
మత్తు కాదు మాయ కాదు, నా ప్రపంచం నీది కాదు,
తప్పు లేదు ఒప్పు లేదు, వడ్డీ లెని అప్పు లేదు,
తప్పు లేదు ఒప్పు లేదు, వడ్డీ లెని అప్పు లేదు,
తలపు నాది తలయు నాది, తలుచుకుంటే ధరము నాది,
దైవము నేను, దయ్యము నేను, నా పర్వములో సర్వము నేను.
దైవము నేను, దయ్యము నేను, నా పర్వములో సర్వము నేను.
వెన్నెల కురవని సమయం, సంగీతమై నిశ్శబ్దం ,
అనిపిస్తుంటే కాళ రాత్రిగ, నిలువబోకు బండరాతిగ.
ఏ మబ్బు వెనుక నక్కినాడో మామ, వెన్నెలనే కురిపించి పంచుతాడు ధీమా,
పలకదా ప్రకృతే సుస్వరపు రాగాలు, పుట్టవా మనసులో సరికొత్తగ భావాలు.
ఆడుగిడగా మిగులునోయ్ తడబడిన అద్దులు,
వెనుచుడక సాగవొయ్ ఆపబొవు హద్దులు,
ఏ రేయినైన రాదా, స్పూర్తినిస్తూ రవి కిరణం,
నీ మనసునుంటే బాధ, ఏ జన్మకైనా అదే మరణం.
ఆడవిలొన నేనున్నా , చుట్టూ మ్రుగములనే కన్నా,
ఆశలోన నేనున్నా ,నేనో ఆకాసవాని విన్నా.
వచ్చిందట సమయం, రానుందట సమరం,
పూరిస్తా నే శంకం, రాసేస్తా నా అంకం.
ఊగుతున్న పడవనున్నా, ఊబిలాంటి అడవినున్నా,
నడుస్తున్న నగరములో, ఉడుకుతున్న ఉదరముతో,
చెరుకుంటా నా గమ్యం, వదిలేస్తా ఈ అరణ్యం.
శ్రీశ్రీ కలగనలేదా , టాగోర్ కథ వినలేదా,
అదిగదిగో మరో ప్రపంచం, అటువైపే నా పయనం.