17 March 2013

ధనదాహము

పరువు పరువు అని బరువు మోసి,
 బరువు బరువు అని పరుగు తీసి,
పరుగు పరుగున కలుగు చేరి,
కలుగు కలుగుని కలుగ కోరి,
కలను కళను మాయ చేసి,
మాయ మర్మము తులము క్రోసి ,
తులము తులము కొండ కాగ,
కొండ కోనలో కులము రేగ,
కులము కులము వేరు కాదని,
వేరు వేరుగ ధనము రాదని,
ధనము ధనము సర్వమేనని,
సర్వ సహితము సర్పమేనని,

పెద్దవాడిని నేను నేనని విర్రవీగి,
పేదవాడు మనిషి కాదని బుర్రతూగి,
మనీ మత్తులో మానవత్వము,
మానమేమో మౌన గానము,
ధనము మత్తులో మాయలోకము,
మాయ మొత్తము.  మరణం వేగము.