"పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే" అని రోజూ చెవులు అరిగిపోయే దాకా విన్న తరువాత ఒకానొక నాడు సీడీల షాప్ లో తిరుగుతూ "అతడు" సీడీ వెనక్కి తిప్పి చూడగా అర్ధమైంది ఏమనగా ఆ గీత రచయిత సిరివెన్నెల గారు కాదని. ఆ రోజుల్లో పిచ్చి పట్టినట్టు మహేష్ బాబు సినిమాలు చూస్తున్నప్పుడు, అతడు టైటిల్స్ లో పడుతున్న లిరిక్స్ కార్డు కూడా చదివే వాడిని. పాటలు సిరివెన్నెల గారునూ, విశ్వా అని చదివినప్పటికీ ఈ విశ్వా అనే వాడు ఏదో చిలిపి పాట రాసాడు అని భ్రమ పడిన మాట వాస్తవం. మీరు ఇప్పటికీ ఆ భ్రమలో ఉండి ఉంటే ఈ వ్యాసం మీ కోసమే.
విశ్వా, విశ్వా వేమూరి ఒక తెలుగు పాటల రచయిత, గాయకుడునూ, సంగీత దర్శకుడు కూడానూ. ఇంతటి వైవిధ్యభరితమైన కళాకారుడు అయినప్పటికీ ఇతని పేరున ఒక వికీపీడియా పుట లేకపోవడం మన తెలుగు పరిశ్రమ విధి విధానాలకు అద్దం పడుతుంది. నేను కేవలం ఒక రచయిత విశ్వాను మాత్రమే చూశాను. మీకు కూడా అతడినే చూపిస్తాను. పది పైన మంచి పాటలు రాసినప్పటికీ ఇతగాడి గురించి ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
"సంతోషం" లో ప్రభు దేవా "మెహబూబా మెహబూబా" అంటూ స్టెప్పులేసినప్పుడు ఇతడి మాటలే ప్రాణం పోసాయి, పోస్కున్నాయి. మొత్తం ఇంగ్లీష్ లో ఉన్న ఈ ర్యాప్ పాటలో మనము చిందులు వేసినప్పటికీ మనము పాటను చూడలేదు. ఆ తరువాయి వచ్చిన గీతాలలో చాలానే మంచివి. మణిశర్మ గారు ఇతడికి రెండు మూడు ఆణిముత్యాలను ఇచ్చారు. "అతడు" లో "పెనుతుఫాను తలొంచి చూసే" అన్నా, మన ప్రియతమ మైఖేల్ జాక్సన్ కి గురువు గారు అంకితమిచ్చిన "నర్తన తార" ఆయినా, పవన్ కళ్యాణ్ "తీన్మార్" లోని "చిగురు బొనియ" ఆయినా, "చిరుత" లోని "చమ్కా చమ్కా" ఆయినా, "డోలే డోలే" అంటూ ఉర్రూతలూగించిన "పోకిరి"నూ ఇతగాడి పాటలే. అలా అని మిగిలిన సంగీత దర్శకులతో ఇతనికి పరిచయం లేదని కాదు. యువన్ తో కలిసి "హ్యాపీ" సినిమాకు గాను "ఛల్ ఛల్ రే ఛల్ మేరే సాథి", రమణ గోగుల గారి సొంతం అయనట్టి "ధగ ధగ మెరిసే మెరుపుల రాణి", దేవి తో "ఆర్య" లో "యౌ రాక్ మై వరల్డ్", ఇద్దరమ్మాయిలతో లో "వయోలిన్ సాంగ్", హార్రిస్ జయరాజ్, ప్రభాస్ ల "మున్నా" లో "కదులు కదులు" మరియు "చమ్మక్కురో ఇలా", మన ప్రియాది ప్రియమైన తమన్ "నీ దూకుడు సాటేవ్వడూ" ఇతడి ప్రయోగాలే.
ఈ పాటలన్నిటినీ గమనించినట్టయితే ఇతడు ర్యాప్ లో ధిట్టనీయు, తెలుగు పై ఇతని పట్టు అపారమనీయు, తక్కువ ఆయినా మంచి పాటలు రాసే రచయిత ఇతను అనీయు చెప్పొచ్చు. వేటూరి లాంటి పునీతమైన తెలుగు రచయితల కాలం చెల్లిందనే చెప్పుకోవాలి. ఈ తరం సంగీతమంతా ఊపుడు దిమ్పుడే. ఈ మారిపోతున్న కాలానికి ఆద్యం పోసింది గురువు గారు సిరివెన్నెల గారు. ఆయనే ఈ మార్పుకి కర్త కర్మ క్రియ. అయితే అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, రామజోగయ్య లాంటి వారు ఆ రాజసం తేలేకపోతున్నారు. తమన్ లాంటి సంగీత దర్శకుల ఆగమనమే మన తరానికి, తెలుగు సినిమా సంగీతానికి దూరం పెంచుతోంది. ఇటువంటి కష్ట కాలమున విశ్వా లాంటి వారిని ప్రోత్సహించడం అవసరం. తెలుగు పాటలు చిరకాలం వర్ధిల్లాలి అన్నా, ఇంగ్లీష్ లో తెలుగు కలిపే విధానం ఏ ఖిచ్డి లా కాకుండా పెరుగాన్నాము లో మామిడి టెంక లా ఉండాలి అన్నా గురువు గారి తరువాయి ఈయనే దిక్కు. తెలుగు చలన చిత్ర సంగీతం వర్ధిల్లాలి. మనం మరింత దూకుడు తో ఇంగ్లీష్ బాషను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అని, విశ్వా లాంటి వారు మరెందరో రావాలి అని, అందులో నేను కూడా ఒకడిని కావాలని ఆశిస్తూ, అవుతానని మరెంతో విశ్వసిస్తూ ....
మీ,
రవి కిరణ్.