సూర్యుడే నిశిలో రాలిపోని, కరుణను భావమే అంతమవనీ
చెడుకే బలగము తోడ్పడని, మనుషులు బంధమే మరచిపోనీ,
బాధే మనసుని తొలిచేయని, నీ ప్రేమే గెలుచునులే.......
మనసా ఇక, పరుగాగక, నను చేరుకో, ఈ దరికి రా, ప్రేమే ఎన్నడూ ఓడదులే
చరణం 1 :
ఇరువురి స్థితి గతి వేరవని, మన ప్రేమల గురుతులు మసకవనీ,
ఋతువుల గుణములు తడబడనీ, పిల్లలు పువ్వులు బోసిపొనీ,
ప్రకృతి సర్వము మారిపోనీ, మన ప్రేమే మారదులే..........
చరణం 2 :
భయపడకు, బెదురిడకు, నిను వీడి పోవును వేదనే,
తగు సమయం, నీ సమరం, తల వంచును ఈ విశ్వం.
మది ఖననం, మరు జననం, ఇక అంతము లేనిది ప్రేమయే,
ఇది నిజమే, ఇక ఉండదు కన్నీరే.....